Breaking News

పరువు హత్య.. ప్రేమలో పడిన కూతురిని గొంతు నులిమి చంపేసిన తండ్రి


తమిళనాడులో యువతి పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. బలవంతంగా పెళ్లి చేసినా ప్రియుడితో కలిసి ఉంటానని పట్టుబడుతున్న కూతురిని దారుణంగా చంపేశాడో కన్నతండ్రి. అయితే తన కూతురు బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయిన చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినా అతడి దుర్మార్గాన్ని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. గొంతు నులమడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తేలడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలోని ఉత్తర మేరకు ప్రాంతంలో జరిగింది. Also Read: స్థానికంగా నివసించే బాలాజీ అనే వ్యక్తి కుమార్తె సెంతారకై కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. తల్లిదండ్రుల కళ్లుగప్పి ప్రియుడితో షికార్లకు వెళ్తోంది. కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న బాలాజీ ఆమెకు మరో యువకుడితో బలవంతంగా పెళ్లి చేశాడు. తనకు పెళ్లి చేసినా ప్రియుడితోనే ఉంటానని, అత్తారింటికి వెళ్లనని సెంతారకై మొండిపట్టు పట్టింది. కుటుంబసభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా ఆమె కాపురానికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీంతో కూతురు ప్రియుడితో వెళ్లిపోతే తన పరువు పోతుందని భావించిన బాలాజీ ఆమెను చంపేయాలనుకున్నాడు. రెండ్రోజుల క్రితం కూతురిని గొంతు నులిమి చంపేసి బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని అందరినీ నమ్మించాడు. అందరూ అతడి మాటలు నమ్మి అంత్యక్రియలకు ఏర్పా్ట్లు చేశారు. Also Read: అయితే స్థానికంగా కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. సెంతారకై మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. రెండ్రోజుల తర్వాత వెలువడిన పోస్టుమార్టం నివేదిక ఆమెను హత్య అని తేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలాజీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి శనివారం మధురాంతకం సబ్‌జైలుకు తరలించారు. Also Read:


By July 26, 2020 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-honour-killed-by-father-in-kanchipuram-district-tamil-nadu/articleshow/77177606.cms

No comments