Breaking News

ఒంటినిండా గాయాలు.. ఆసుపత్రిలో ఆర్జీవీ! 'ఎవడ్రా నన్ను కొట్టింది'.. రియల్లీ షాకింగ్!!


అయ్యో పాపం..! ఒంటినిండా ఆ గాయాలేంటి? ఆయన ఆసుపత్రిలో బెడ్‌పై అలా పడుకున్నారేంటి? అసలేం జరిగింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా ఇదే సందేహం కలుగుతుంది. గత కొంతకాలంగా ఆర్జీవీ సృష్టిస్తున్న హంగామా, చెలరేగుతున్న కాంట్రవర్సీ కారణంగా ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుందనే అనుమానం కలుగుతుంది. కానీ ఇది నిజం కాదు.. ఆర్జీవీపై రాబోతున్న మరో సినిమా. '' అనే పేరుతో రాబోతున్న కొత్త సినిమా మోషన్ టీజర్ ఇది. లాక్‌డౌన్ వేళ వరుస సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ లాజిక్‌గా మాట్లాడుతున్న వర్మ పైనే పడ్డాయి అందరి కళ్ళు. ఆయన రీసెంట్ మూవీ 'పవర్ స్టార్'తో వివాదం ముదిరింది. దీంతో.. వేరే వాళ్ళను విమర్శిస్తూ సెటైరికల్ సినిమాలు తీయడం నీ ఒక్కడికే కాదు.. మాకు కూడా తెలుసంటూ ముందుకొస్తున్నారు నయా దర్శకులు. ఇప్పటికే ఆర్జీవీ తీరును కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ నూతన్ నాయుడు 'పరాన్నజీవి' మూవీ రూపొందించగా.. 'డేరా బాబా' పేరుతో షకలక శంకర్ ప్రధాన పాత్రలో మరో సినిమా రెడీ అవుతోంది. దీంతో పాటే 'ఎవడ్రా నన్ను కొట్టింది' అనే పేరుతో ఇంకొక మూవీ ప్లాన్ చేశాడు మరో దర్శకుడు నీలకంఠం. సినీ లవర్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై 'ఎవడ్రా నన్ను కొట్టింది' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తనని కొట్టింది ఎవరో తెలియక ఆరు నెలల పాటు ఆర్జీవీ పడిన సంఘర్షణే ఈ సినిమా కథాంశంగా తీసుకున్నామని డైరెక్టర్ నీలకంఠం చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశామని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ మోషన్ టీజర్ రిలీజ్ చేసి తమ సినిమాను కూడా చర్చల్లో నిలిచేలా చేసుకున్నారు. ఈ పరిస్థితులు చూసి.. ఇన్నాళ్లూ అందరినీ టార్గెట్ చేసిన వర్మ, ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యారని అంటున్నారు సినీ విశ్లేషకులు.


By July 26, 2020 at 09:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/another-movie-on-rgv-evadra-nannu-kottindi-teaser-released/articleshow/77177721.cms

No comments