Breaking News

ప్రాణాలు తీసిన ప్రేమ.. ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణహత్య


పిల్లల ప్రేమ వ్యవహారంలో ఓ కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురైన ఘోర ఘటన కర్ణాటకలోని జిల్లాలో జరిగింది. జిల్లాలోని సుక్కాలపేటలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సుక్కాలపేటలో ఒకే వీధిలో ఈరప్ప, ఫకీరప్ప కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ క్రమంలోనే ఈరప్ప కొడుకు, ఫకీరప్ప కూతురు ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారం పెద్దలకు తెలియడంతో బుద్ధిగా ఉండాలని పిల్లలకు సూచించారు. దీనిపై రెండు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యువతి, యువకుడు వీధి చివరన చనువుగా మాట్లాడుకుంటూ కనిపించడంతో మళ్లీ గొడవ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఫకీరప్ప కుటుంబంలోని ఆడామగా కలిపి ఏడుగురు కోపంతో ఊగిపోతూ.. ఈరప్ప కుటుంబంపై కత్తులు, కొడవళ్లుగా దాడికి పాల్పడ్డారు. ఊహించని ఘటనతో షాకైన ప్రేమికులు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశారు. Also Read: వారిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ఫకీరప్ప కుటుంబం మారణహోమం సృష్టించింది. ఈరప్ప(60)తో పాటు అతడి కుటుంబంలోని నాగరాజ్‌(38), సుమిత్రమ్మ(55), శ్రీదేవి(30), హనుమేశ్‌(40)లను గొంతు కోసి దారుణంగా చంపేశారు. రక్తపు మడుగులో ఉన్న ఈరప్ప(60)ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి, తాయమ్మలను స్థానికులు రాయచూరు తరలించారు. సింధనూరు టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. Also Read: సింధనూరు పట్టణంలో ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్‌కు భయపడి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇలాంటి సమయంలో సుక్కాలపేటలో జరిగిన మారణహోమం తెలుసుకుని పట్టణ ప్రజలు భయంతో వణికిపోయారు. సింధనూరు చరిత్రలో ఇంతవరకూ ఇలాంటి దారుణం జరగలేదని చెబుతున్నారు. సుమారు 10ఏళ్ల కిందట స్థానిక టెలిఫోన్‌ కేంద్రం ఎదురుగా ఓ హోటల్‌ యజమాని కూతురిని ప్రేమోన్మాది పట్టపగలే గొంతుకోసి చంపేశాడు. ఆ భయానక ఘటనను తలుచుకుని పట్టణ ప్రజలు ఇప్పటికీ ఆందోళన చెందుతూ ఉంటారు. Also Read: ఈ సమయంలోనే శనివారం ఏకంగా ఓ కుటుంబంలోని ఐదుగురిని గొంతు కోసి చంపేశారన్న వార్త తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు కారణమైన ప్రేమజంట ప్రస్తుతం పోలీస్‌స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది. వారిపై ఎవరూ దాడికి పాల్పడకుండా పోలీసులు రక్షణ కల్పించారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసినప్పుడు రెండు కుటుంబాలు సర్దుబాటు చేసుకుంటే ఇంతటి దారుణానికి దారి తీసేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. Also Read:


By July 12, 2020 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/karnataka-5-members-of-a-family-murdered-by-neighbour-family-over-love-affair-issue-in-sindhanur-of-raichur-district/articleshow/76917504.cms

No comments