Breaking News

రాధే శ్యామ్ పోస్టర్ పై నెటిజన్స్ ట్రోల్స్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం రాధే శ్యామ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జూలై 10న చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మూవీ మేకర్స్‌. అయితే పోస్టర్‌కి విశేషమైన స్పందన లభించింది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేశారు. అయితే కొందరు మాత్రం పోస్టర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్స్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కాపీ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. సినిమా పోస్టర్స్‌ని కాపీ కొట్టి రూపొందించారని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా నటించిన ‘కంచె’ సినిమా పోస్టర్‌ను కొందరు పోస్టు చేస్తున్నారు. మరికొందరు విక్రమ్, అమీ జాక్సన్ నటించిన ఐ సినిమా పోస్టర్, బెల్లకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే సాక్ష్యం సినిమా పోస్టర్‌ను చూసి రాధేశ్యామ్ పోస్టర్ కాపీ కొట్టారంటూ మెసేజులు పెడుతున్నారు. మరికొందరు నెటిజాన్స్ బాలీవుడ్ మూవీ రామ్ లీలా సినిమా పోస్టర్ కి రాధేశ్యామ్ పోస్టర్ కాపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీమ్స్ కూడా క్రియేట్ చేసి రాధేశ్యామ్ పోస్టర్ పై ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. Read More: అయితే ప్రభాస్ సినిమాలకు ట్రోలింగ్స్ కొత్తేం కాదు... గతంలోను ప్రభాస్ సినిమాలకి సంబంధించి ఇలాంటి ట్రోల్స్ చాలానే వచ్చాయి. ప్రభాస్ - పూజాహెగ్డే హీరో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'రాధే శ్యామ్స చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


By July 11, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/netizens-trolling-on-radhe-shyam-poster/articleshow/76904288.cms

No comments