మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కి వెళ్లిన వధువు.. గొంతు కోసి చంపిన యువకుడు
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పెళ్లికి కొద్ది గంటల ముందు వధువు దారుణహత్యకు గురైంది. బ్రైడల్ మేకప్ కోసం సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన ఆమె ఓ యువకుడు కత్తితో గొంతు కోసి చంపేశాడు. రత్లామ్ జిల్లా జవోరా గ్రామానికి చెందిన యువతికి ఓ యువకుడితో శనివారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ముస్తాబయ్యేందుకు ఆమె అక్కతో కలిసి ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. మేకప్ వేసుకుంటున్న సమయంలో లోనికి ప్రవేశించిన ఓ యువకుడు కత్తితో వధువు గొంతు కోసి పరారయ్యాడు. Also Read: ఈ ఘటనతో షాకైన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కారణం ప్రేమ వ్యవహారమా? లేక వ్యక్తిగత కక్షలా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్పటివరకు బంధువుల రాకతో కళకళ్లాడుతూ కనిపించిన పెళ్లి మండపం వధువు హత్యతో బోసిపోయింది. Also Read:
By July 06, 2020 at 10:12AM
No comments