చిరంజీవి అల్లుడి సినిమాను మధ్యలో వదిలేసిన సుశాంత్ ప్రియురాలు
కూడా సినిమాల్లోకి వస్తున్న విషయం తెలిసింది. పులివాసు దర్శకత్వంలో వస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సూపర్ మచ్చి చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. గ్యాప్ లేకుండా కళ్యాణ్ దేవ్ షూటింగ్ లో పాల్గొంటునాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కళ్యాణ్ దేవ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముందుగా సూపర్ మచ్చి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని తీసుకున్నారని తెలిపారు. అయితే సుశాంత్‌తో తనకు సినిమా ఉందంటూ ఆమె మధ్యలోనే వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకుని రీషూట్ చేసినట్టు కళ్యాణ్ తెలిపారు. తూనీగా తూనీగా తెలుగు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సూపర్ మచ్చి సినిమాలో బార్ లో పని చేసే సింగర్ గా కళ్యాణ్ దేవ్ నటిస్తున్నారు. ఇంకా ఒక సాంగ్ రెండు రోజుల టాకీ పార్టు షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్నారు. ఈ కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనడానికి తన సినిమా నిర్మాతలు ముఖ్య కారణమన్నారు కళ్యాణ్. వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించానన్నారు. నిర్మాతల ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు కళ్యాణ్. షూటింగ్‌లో పాల్గొనడంతో తాను ప్రస్తుతం తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ తన పనులు తానే చేసుకుంటున్నారు.
By July 06, 2020 at 11:01AM
No comments