పొలం వివాదంతో తమ్ముడిని నరికి చంపిన అన్న.. గుంటూరులో దారుణం
పొలం పాసుపుస్తకం విషయంలో తలెత్తిన వివాదంలో సొంత తమ్ముడినే కొడవలితో నరికేశాడో అన్న. ఈ ఘటన జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడులో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మిక్కిలి యోహాను, మిక్కిలి జులియన్‌బాబు సొంత అన్నదమ్ములు. కుటుంబ ఆస్తిగా ఉన్న పొలం విషయంలో మంగళవారం ఇద్దరూ గొడవపడ్డారు. కుటుంబసభ్యులు ఇద్దరినీ విడదీసి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. Also Read: అయితే కొద్దిసేపటికే యోహాన్ కల్లుగీసే కొడవలితో వచ్చి తమ్ముడు జులియన్‌బాబు(39) కాలిపై నరికాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బాపట్ల ఏరియా హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. పరారీలో ఉన్న యోహానుపై కర్లపాలెం ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. Also Read:
By July 01, 2020 at 07:52AM
No comments