Breaking News

విశాఖలో విషాదం.. మూడంతస్తుల భవనం నుంచి పడి యువకుడు మృతి


విశాఖలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. విశాలక్షినగర్ విజయ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మూడంతస్తుల పై నుంచి పడి చనిపోవడంతో పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆ యువకుడ్ని తోసేశారా..? లేకుంటే ఆత్మహత్య చేసుకున్నాడా..? అసలేం జరిగింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. మృతుడు విజయ్ కుమార్ స్నేహితులను , కుటుంబసభ్యుల్ని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆరిలోవ పీఎస్‌లో యువకుడు మృతిపై అనుమానాస్పద కేసు నమోదయ్యింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


By July 12, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-died-after-falling-from-three-floor-building/articleshow/76917843.cms

No comments