Breaking News

పెళ్లైన మూడో రోజునే వచ్చేశా..! మొత్తం ఆయన వల్లే.. భర్త గురించి ఓపెన్ అయిన ప్రియమణి


దక్షిణాది సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితం హీరోయిన్ . తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ 'రావణ్' సినిమాతో హిందీ చిత్రసీమలోనూ అడుగు పెట్టింది. విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె పెళ్లి తర్వాత కూడా అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో '', '' సినిమాల్లో నటిస్తున్న ప్రియమణి... ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త ముస్తఫా రాజ్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పింది. నా మొగుడు బంగారం అంటూ తెగ మురిసిపోయిన ప్రియమణి, ఆయన కారణంగానే ఇంకా సినిమాల్లో నటిస్తూ మీ అందరినీ అలరిస్తున్నానని చెప్పింది. హీరోయిన్లకు పెళ్లి తర్వాత భర్త సహకారం, అంగీకారం లేదంటే సినిమాల్లో నటించడం కుదరదు.. కానీ ఆ విషయంలో తాను అదృష్ట వంతురాలినని, తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే పెళ్లైన మూడో రోజునే షూటింగ్ స్పాట్‌కి వెళ్లగలిగానని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఆయనతో బోలెడంత సమయం గడిపానని చెప్పిన ఆమె కుటుంబ జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ముంబై డేట్స్ విషయం కూడా తన భర్తనే స్వయంగా చూసుకుంటారని ఆమె తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం చేస్తున్న 'విరాటపర్వం' సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న ఆమె మాజీ నక్సలైట్ వద్ద శిక్షణ పొందినట్లు వార్తలు విన్నాం. అయితే అలాంటిదేమీ లేదని పేర్కొంటూ ఆ వార్తలను ఖండించింది ప్రియమణి. తన పాత్రకు సంబంధించిన అన్ని వివరాలు డైరెక్టర్ చూసుకుంటున్నారని తెలిపింది. మరోవైపు వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది ప్రియమణి. ఇటీవలే విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల్లో ప్రియమణి నటన చూడాలని ఆతృతగా ఎదురుచూస్తోంది టాలీవుడ్ సినీ లోకం. Also Read:


By July 25, 2020 at 08:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/priyamani-open-comments-on-her-husband-mustafa-raj/articleshow/77161783.cms

No comments