Breaking News

బిగ్ బాస్ 4 లో ఫేమస్ ఫోక్ సింగర్..?


గత మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్, నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు స్టార్ మా టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుందని తెలిసినప్పటి నుండి అందులో వచ్చే కంటెస్టెంట్లు ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి.

టాలీవుడ్ పాపులర్ హీరోయిన్లు.. శ్రద్ధా దాస్, హంసా నందినీ, యామినీ భాస్కర్, డాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కంటెస్టెంట్లుగా రాబోతున్నారని  వినిపించింది. తాజాగా హౌస్ లోకి ఫోక్ సింగర్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. జానపద గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న మంగ్లీ బిగ్ బాస్ సీజన్ 4 లోకి రాబోతుందట. ఈ మేరకు బిగ్ బాస్ టీమ్ ఆమెని సంప్రదించిందని టాక్. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడి. మంగ్లీగా పరిచయమై యూట్యూబ్ లో ఎన్నో పాటల్లో కనిపించింది.

ఆమె ఖాతాలో చాలా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం గురించిన పాటకానీ, ఇంకా తెలంగాణ పండగల గురించిన పాటలు చాలానే పాడింది. అంతేకాదు సినిమా పాటలకి కూడా ఆమె గొంతు విప్పింది. అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటని ఆలపించింది మంగ్లీనే. మరి ప్రచారం జరుగుతున్నట్టుగా హౌస్ లోకి మంగ్లీ వస్తుందో లేదో తెలియాలంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.



By July 25, 2020 at 05:26PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51948/mangli.html

No comments