ఖమ్మంలో గుట్టుగా వ్యభిచారం.. ఐదుగురు విటులు, మహిళ అరెస్ట్
పట్టణంలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. కల్వొడ్డు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి కొద్దిరోజులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ ఇంటికి యువకుల తాకిడి ఎక్కువ కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. Also Read: అక్కడ ముగ్గురు యువతులతో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. కూసుమంచికి చెందిన ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి యువతులను, నిస్సహాయ మహిళలను తీసుకొచ్చి ఖమ్మంలో వేశ్యా గృహం నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. నిర్వాహకురాలితో పాటు విటులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు, సెక్స్‌వర్కర్లను ప్రభుత్వ హాస్టల్‌లో ఉంచారు. పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:
By July 10, 2020 at 10:20AM
No comments