Breaking News

ప్రభాస్ 20.. ఇకపై రాధేశ్యామ్.. ఫస్ట్ లుక్ అదిరింది..


నేషనల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్ర టైటిల్ పై విడుదల ఎప్పుడెప్పుడుడా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. పీరియాడిక్ డ్రామాగా కె రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజైంది. ప్రభాస్ ని నేషనల్ స్టార్ చేసిన బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ డేట్ అయిన నేడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రానికి రాధేశ్యామ్ టైటిల్ ని పెట్టారు. తెలుగు, తమిళం, హిందీ,  మళయాల భాషల్లో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్, పూజా హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

పోస్టర్ బ్యాగ్రౌండ్ లో కనిపించే విజువల్స్ యూరప్ లొకేషన్లని తలపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా యూరప్ లో జరిగే లవ్ డ్రామాగా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ చిత్రంలో నటించే నటీనటుల పేర్లని కూడా బయటపెట్టింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ, కమెడియన్ ప్రియదర్శి, మురళి శర్మ, రిక్షా రాణి, కునాల్ రాయ్ కపూర్, సత్యం మొదలగు వారు ఉన్నారు. 



By July 10, 2020 at 08:47PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51772/prabhas20.html

No comments