కారులో లిఫ్ట్ అడిగినందుకు రూ.46వేలు దోపిడీ.. హైదరాబాద్ శివారులో ఘటన
కారులో లిఫ్ట్ అడిగి ఎక్కిన వ్యక్తి నిలువు దోపిడీకి గురైన ఘటన శివారు రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయకిరణ్ యాదవ్ షాద్‌నగర్‌లో ఉంటూ కొందుర్గు శివారులోని ఓ టెక్స్‌టైల్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జూన్ 30న రాత్రి 8 గంటలకు విధులు ముగించుకుని షాద్‌నగర్ వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉన్నాడు. కొందుర్గు వైపు నుంచి షాద్‌నగర్ వెళ్తున్న ఓ కారును లిఫ్ట్ అడిగి ఎక్కాడు. డ్రైవర్ శివకుమార్‌తో పాటు రమేశ్, రాజు అలియాస్ రూప్లా కలిసి కారులోనే జయకిరణ్‌ను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకొని పాస్‌వర్డ్ తెలుసుకుని షాబాద్ శివారులో వదిలేసి పరారయ్యారు. Also Read: షాద్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద రూ.20 వేలు, నందిగామ పెట్రోల్ బంకు వద్ద మరో రూ.26 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించారు. బాధితుడు వెంటనే కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ శివకుమార్‌పై గతంలోనూ ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By July 10, 2020 at 09:59AM
No comments