Breaking News

టెక్కీ లావణ్య ఆత్మహత్య కేసు.. ప్రకాశం జిల్లాలో ముగ్గురి అరెస్ట్


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్య లహరి ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు మరికొందరిని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన లావణ్య, పైలట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కులాంతర వివాహం చేసుకుని కొన్నాళ్లుగా శంషాబాద్‌లో కాపురం ఉంటున్నారు. పెళ్లయి ఇన్నాళ్లైనా పిల్లలు పుట్టడం లేదంటూ భర్త, అత్తమామలు తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, దీంతో పాటు తన భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడంటూ లావణ్య కొద్దిరోజుల క్రితం ఓ వీడియో తీసుకుని అనంతరం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య భర్తను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదవరిమడుగు గ్రామానికి చెందిన ముగ్గురిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో పోలీసులు అనేక షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. భర్త పైలెట్ వెంకటేష్ అకృత్యాలతో భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పైలెట్ వెంకటేష్ ఆఫీస్ పని పేరుతో ప్రియురాలితో కలిసి విదేశాలలో తిరిగేవాడని వెల్లడైంది. ఫ్లైట్ టికెట్‌లు, వాట్సాప్ చాటింగ్, లైవ్ చాటింగ్‌లో లహరి వెంకటేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అక్రమ సంబంధం గురించి నిలదీసింది. గుట్టు తెలిసిపోవడంతో ఇక భార్య ముందే లైవ్‌లో ఆ యువతితో సరస సంభాషణలు మొదలు పెట్టాడు. ఇవన్నీ చూసి లావణ్య సహించలేకపోయింది. Also Read: అంతేకాకుండా ఆ యువతికి ఫోన్ చేసి తనకు అన్యాయం చేయొద్దని వేడుకుంది. వెంకటేష్‌తో కలిసి తిరుగుతానంటూ ఆ యువతి లహరికి తెగేసి చెప్పేసింది. లహరి ఆ యువతికి ఫోన్ చేసిన విషయం వెంకటేష్‌కు తెలియగానే అతను రెచ్చిపోయాడు. వెంకటేష్ గత కొంత కాలంగా లహరిపై భౌతిక దాడులకు తెగబడ్డాడు. మానసికంగా, శారీరకంగా లహరిపై దాడులు చేసేవాడు. తన అక్రమ సంబంధం గురించి భార్యకు తెలిసి అడ్డు పడుతుందన్న కోపంతో లహరిని మానసిక వేధింపులకు గురి చేయడమే కాకుండా భౌతికంగా చిత్రహింసలు పెట్టేవాడు. వెంకటేష్ వేధింపులు తట్టుకోలేక చివరకు లహరి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. Also Read:


By July 07, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-arrests-another-3-persons-in-lavanya-suicide-case/articleshow/76828567.cms

No comments