Breaking News

ఎన్టీఆర్‌కు విలన్‌గా మంచు మనోజ్.. అంతా ఉత్తుత్తే!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయబోయే చిత్రంలో విలన్‌గా నటించబోతున్నారని గడిచిన రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో విలన్‌ పాత్ర చాలా కీలకమని.. ఇలాంటి పాత్రకు మంచు మనోజ్ అయితే బాగుంటారని భావించిన త్రివిక్రమ్ ఆయన్ని సంప్రదించారని రూమర్లు పుట్టుకొచ్చాయి. మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. అయితే, ఈ రూమర్‌లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈ మేరకు మంచు మనోజ్ టీం క్లారిటీ ఇచ్చింది. Also Read: ప్రస్తుతం వైరల్ అవుతోన్న రూమర్‌లో పూర్తిగా అసత్యమని, ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారని మంచువారబ్బాయి టీం మీడియా వర్గాలకు వెల్లడించింది. మనోజ్ చాలా కాలం తరవాత మళ్లీ వెండితెరపై మెరవబోతున్న విషయం తెలిసిందే. ఎంఎం ఆర్ట్స్ పేరిట సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసుకున్న మనోజ్.. ఈ బ్యానర్‌లో మొదటి సినిమాగా ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. Also Read: మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. బహుశా ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కావచ్చు. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేస్తోన్న రెండో సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.


By July 07, 2020 at 12:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-manoj-as-antagonist-in-jr-ntr-next-project-is-completely-a-false/articleshow/76828437.cms

No comments