విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్, రూ.5కోట్లు డిమాండ్
విశాఖ నగరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌కు గురికావడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి అతడిని దుండగులు అపహరించినట్లు కుటుంబసభ్యులు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డాబా గార్డెన్‌కు చెందిన సురేశ్‌కుమార్ ఆదివారం రాత్రి తన ఫ్రెండ్‌తో కలిసి దొండపర్తి ప్లైఓవర్ బ్రిడ్జి కూర్చుని ఉండగా కారులో వచ్చిన దుండగులు కత్తులు, తుపాకీతో బెదిరించి ఎత్తుకెళ్లారు. తమకు రూ.5 కోట్లు ఇస్తే విడిచిపెడతామని అతడి భార్యకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పాటు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. Also Read: దీంతో కంగారుపడిన సురేష్ భార్య ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ విషయం పోలీసులకు చేరిందని తెలుసుకున్న కిడ్నాపర్లు సురేష్‌ను వదిలేసి కారులో పరారయ్యారు. పోలీసులు వారిని వెంబడించడంతో యలమంచిలి సమీపంలో కారును వదిలేసి వెళ్లిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై వైజాగ్ సీటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా స్పందిస్తూ.. ఆస్తి తగాదాలతో సురేష్‌ను కిడ్నాప్ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. కిడ్నాపర్ల కోసం సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ గాలిస్తోందని తెలిపారు. Also Read:
By July 07, 2020 at 12:26PM
No comments