తమ్ముడికి కరోనా వచ్చిందని.. అన్న ఆత్మహత్య
కరోనా అనేకమంది జీవితాల్ని చిన్నాభిన్నం చేసేస్తోంది. మానవ సంబంధాల్ని మంటగలుపుతోంది. అనేకమంది ప్రాణాల్ని ఇప్పటికే బలి తీసుకుంది. కరోనా లక్షణాలతో కొందరు, కరోనా భయంతో మరికొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. తాజాగా తన తమ్ముడికి కరోనా సోకిందన్న బాధతో భయంతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోలారు నగరంలోని గాంధీనగర్ కాలనీలో నాగరాజ్ అనే 37 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తాపీ కార్మికుడుగా పనిచేస్తున్న నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం తమ్మునికి కరోనా పాజిటివ్‌గా రావడంతో అతడ్ని ఆరోగ్య శాఖ అధికారులు కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో తన తమ్ముడికి సోకిన కరోనా తనకు కూడా సోకి ఉంటుందేమోననే అన్న నాగరాజ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. Read More: అటు తమ్ముడు కరోనాతో ఆస్పత్రి పాలవ్వడం.. ఇటు అన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ముందు జాగ్రత్తగా నాగరాజు శాంపిల్స్ కూడా సేకరించి కరోనా టెస్టుల కోసం అధికారులు ల్యాబ్‌కు తరలించారు. ఇంకా ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది. కుటుంబానికి కూడా కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.
By July 20, 2020 at 10:57AM
No comments