Breaking News

కరోనా మరో ఐదేళ్లు ఉండాలి.. అందరికీ ఇస్త్రీ అవ్వాలి: దర్శకుడు తేజ సంచలన కామెంట్స్


ఒకవైపు కరోనా వైరస్ వచ్చి జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఈ కరోనా మరో ఐదేళ్లు ఉండాలంటూ సంచలన కామెంట్స్ చేశారు దర్శకుడు తేజ. ఇండస్ట్రీతో పాటు అన్ని చోట్లా గాలితనం ఎక్కువగా ఉందని.. పనికిరాని బ్యాచ్ ఇండస్ట్రీలో 50 శాతానికి పైగా ఉన్నారంటూ షూటింగ్‌లలో వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో లెక్కలతో సహా వివరించారు తేజ. ఆయన మాట్లాడుతూ.. సినిమాలు అనే కాదు అన్నిచోట్లా.. చిల్లరతనం, గాలితనం ఎక్కువైపోయింది. సినిమాకి వెళ్లడం.. రాత్రిపగలు పనిచేయడం.. బాగా సంపాదించడం.. వచ్చినడబ్బుతో టీవీ, ఫోన్లు ఇలా విలాసాలు చేయడం ఇదే పని. పని స్టైల్‌లో కూడా గాలితనం వచ్చేసింది. మనకే ప్రపంచం అంతా ఇదే ఉంది. ఎంత చిల్లరగా చేస్తున్నారంటే కొత్త ఫోన్ కొని సౌండ్ పైకిపెట్టుకుని పబ్లిక్ ప్లేస్‌లో వింటూ ఉంటాడు. ఇంకొకడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కరోనా దెబ్బకు ఈ గాలితనం అంతా పోయింది. నోరే తెరవడం లేదు.. నోరు తెరిస్తే వైరస్ లోపలికి పోతుంది. కరోనా ఉండాలి.. ఇంకో ఐదారేళ్లు ఉంటే భూమి మొత్తం ఇస్త్రీ అయిపోద్ది.. మనుషులందర్నీ ఇస్త్రీ చేస్తుంది. నేను జూన్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నా.. కరోనా ఉంటుంది కాని.. కాని ఒక సిస్టమ్ ఏర్పరచుకుని అందులోని షూటింగ్స్ జాగ్రత్తగా చేయాలి. ఇష్టం వచ్చినట్టు జనాన్ని తీసుకువచ్చేయకూడదు. నిజానికి షూటింగ్ అంటే 200 మంది ఉంటారు.. అందులో పనిచేసే వాళ్లు 40 మందే. వారిలో చాలా మంది గాలిగాళ్లు ఉంటారు. ఇండస్ట్రీలో కూడా గాలితనం ఉంది. ఇప్పుడు అవన్నీ తగ్గి ఎవరైతే పనిచేస్తారో వాళ్లే లొకేషన్‌కి వచ్చేలా సెట్ చేస్తున్నాం. తక్కువ మందితో చేసినంత మాత్రాన షూటింగ్ ఎక్కువ రోజులు పట్టదు. ఇదివరకూ పెద్ద హీరోలకు అసిస్టెంట్‌గా ఒకరు ఉండేవారు.. ఇప్పుడు ఒక మాగాడికి తొమ్మిది మంది.. అమ్మాయికి ఆరుగులు అసిస్టెంట్లు ఉంటున్నారు. ఇదీ వాళ్ల స్టాఫ్. అంతమంది ఎందుకు?? ఈ లెక్కన 20 మంది యాక్టర్స్ ఉంటే.. వాళ్ల పక్కన ఎంత మంది బ్యాగ్‌లు మోసేవాళ్లు ఉంటారో లెక్కేయండి. తెరపై కనిపించే స్టాఫ్.. వాళ్లకు సపోర్టింగ్ స్టాఫ్ (కెమెరా, లైటింగ్) వీళ్లు మాత్రమే కాకుండా పనికి రాని స్టాఫ్ అనేది కూడా మరోటి ఉంది. వాళ్లు 40-50 శాతం స్టాఫ్ ఉంటారు. ఈ పనికి రాని వాళ్లకి ఫుడ్ పెట్టేందుకు మరో ఐదారుగురిని స్టాఫ్‌గా పెడతారు. వాళ్లకి కార్లు, డ్రైవర్లు ఇలా చాలా పనికి రాని ఖర్చు ఉంటుంది. వాళ్లు తెరమీద కాని.. తెర ముందు కాని.. తెర వెనుక కాని ఏం పనిచేయరు. ఇప్పుడు కరోనా వల్ల ఇలాంటి పనికిరాని వాళ్ల శాతం తగ్గుతుంది తప్పితే జనం తక్కువ ఉన్నంత మాత్రాన.. షూటింగ్‌కి ఆలస్యం అవ్వదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు తేజ. ఈయన ప్రస్తుతం ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే చిత్రాలను చేస్తున్నారు.


By July 15, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-teja-sensational-comments-on-coronavirus/articleshow/76971340.cms

No comments