బాధ్యత ఉండక్కర్లా.. రహస్యం దేనికి? కొరటాల రిక్వెస్ట్
సోకితే ఏదో అయిపోతుందనే ప్రచారం బాగా చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ సోకితే చనిపోతారనే భయాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈ వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ కనీసం టెస్ట్‌లు చేయించుకోవడానికి కూడా ముందుకు రావడంలేదు. దీంతో ఈ వైరస్ వారికి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్లకు వ్యాపించి అత్యంత ప్రమాదకరంగా మారింది. నిజానికి వ్యాధి లక్షణాలకంటే కూడా ఏదో అయిపోతుందనే భయంతో చాలా మంది వ్యాధిగ్రస్తులు డిప్రెషన్‌లోకి వెళిపోతూ.. లేనిరోగాన్ని కొనితెచ్చుకుంటున్నారని.. వాస్తవానికి కరోనా సోకినా వారం పది రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లిపోవచ్చని వైద్యులు సూచిస్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళనలు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బీ అలర్ట్ అంటున్నారు దర్శకుడు . ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకినవారిని తన విజ్ఞప్తిని తెలియజేశారు. ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటికీ చాలామంది ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఇలా చేయడం కరోనా వైరస్ కంటే ప్రమాదకరం. ఇది చాలా భయంకరమైన అనుభవాన్ని తెలియజేస్తుంది. మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం.. దయచేసి కరోనా సోకిన ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచొద్దు.. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు.. తమను కలిసిన వారికి తెలియజేయండి. తద్వారా మీరు జాగ్రత్తగా ఉండేదుకే కాకుండా.. మీతో పాటు వాళ్లు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇది నా హృదయపూర్వక అభ్యర్థన’ అంటూ ట్వీట్ చేశారు కొరటాల. ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
By July 15, 2020 at 08:14AM
No comments