విశాఖలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. గంటల్లోనే చేధించిన పోలీసులు
విశాఖ నగరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో దత్తత కోసం ఓ బిడ్డ కావాలని బాబామెట్టకు చెందిన పటాన్ సల్మాన్‌ఖాన్ (19), షేక్ సుబానీ (19), బండారు రోషన్‌బాబుకు చెప్పింది. దీంతో వారు ముగ్గురు ఈ నెల 21వ తేదీ రాత్రి ఆటోలో విశాఖ వచ్చారు. Also Read: బస్టాండ్ వద్ద హైదరాబాద్ ఇరానీ టీ సెంటర్ సమీపంలో నిద్రిస్తున్న యాచకులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవానీ దంపతుల కుమారుడు రెండేళ్ల గణేష్‌ను చూసి కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటాక 12.30 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న గణేష్‌ను అపహరించారు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన దంపతులు పక్కలో పిల్లాడు లేకపోవడంతో కంగారుపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో 22వ తేదీ ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. పిల్లాడిని ఆటోలో తీసుకెళ్తున్నట్లు గమనించి దాని నంబర్ ప్లేట్ ఆధారం దర్యాప్తు చేపట్టారు. ఆటో విజయనగరంలోని బాబామెట్టకు చెందిన వ్యక్తిదని తేలడంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి బిడ్డతో పాటు నిందితులను పట్టుకున్నారు. చాకచక్యంగా కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులను పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అభినందించారు. Also Read:
By July 24, 2020 at 09:56AM
No comments