కుటుంబానికి అండగా ఉంటానని నమ్మించి.. తల్లీకూతుళ్లపై లైంగిక దాడి
మగదిక్కు లేని కుటుంబానికి అండగా ఉంటానని నమ్మించి తల్లీకూతుళ్లను లోబరుకుని లక్షల రూపాయలను కాజేని మోసగాడి ఉదంతమిది. విశాఖ జిల్లా పెందుర్తి అప్పన్నపాలెం ప్రాంతానికి చెందిన మహిళ(50), ఆమె కూతురు(35) ఎనిమిది నెలల క్రితం వరకు మురళీనగర్ ప్రాంతంలో ఉండేవారు. కూతురు భర్తతో గొడవపడి తన పదహారేళ్ల కూతురితో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి మరణించడంతో తల్లి చేసే దుస్తులు, ఫైనాన్స్ వ్యాపారానికి సాయంగా ఉండేది. వీరి ఒంటరితనాన్ని, మెరుగైన ఆర్థిక పరిస్థితిని చూసి యర్రంశెట్టి చిన్ని అనే వ్యక్తి వారితో పరిచయం పెంచుకున్నాడు. Also Read: మీ కుటుంబానికి అండగా ఉంటానంటూ తల్లికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే అవసరాల కోసమంటూ తరుచూ ఆమె నుంచి డబ్బులు తీసుకునేవాడు. తర్వాత ఆమె కూతురికి కూడా మాయమాటలు చెప్పి లొంగదీసుకుని శారీరకంగా వాడుకున్నాడు. ఓ ఫ్లాట్ కొంటానని చెప్పి తల్లీకూతుళ్ల దగ్గర నుంచి పలు దఫాలుగా రూ.30 లక్షలు నగదు తీసుకున్నాడు. ఎంతకీ ఫ్లాట్ కొనకపోవడంతో తల్లీకూతుళ్లు అతడిని గట్టిగా నిలదీయడంతో బ్లాక్‌మెయిల్ చేశాడు. తాను చెప్పినట్లు వినకపోతే తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టాడు. Also Read: బాలికకు కూడా మీ లాంటి గతే పట్టిస్తానని చిన్ని వారిని హెచ్చరించాడు. దీంతో ఆ తల్లీకూతుళ్లు తమ గోడుకు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న చిన్ని వారిని మరింత వేధించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన బాధితురాళ్లు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 24, 2020 at 10:18AM
No comments