కుమార్తెకి కరోనా పాజిటివ్.. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తల్లి ఆత్మహత్య
కరోనా వైరస్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ శాతం తిరిగి కోలుకుంటుండగా.. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మహమ్మారిపై నెలకొంటున్న భయంతో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం కలవర పరుస్తోంది. ఇప్పటికే చాలామంది కరోనా భయంతో ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా కూతురికి కరోనా సోకిందన్న భయంతో ఆమె తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. Also Read: జిల్లా అన్నాదానప్పట్టి పళనియప్ప నగర్ ప్రాంతానికి చెందిన శాంత (65) అనే మహిళ కుమార్తెతో కలిసి నివాసముంటోంది. ఆమె కూతురు కరోనా నియంత్రణ పనుల్లో వాలంటీర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల తొమ్మిదో తేదీన ఆమెకు కరోనా పాజిటిట్ అని తేలడంతో హాస్పిటల్‌లో చేరింది. అధికారులు ఆమె తల్లి శాంతను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Also Read: దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుమార్తెకు కరోనా సోకిందన్న ఆందోళనతో పాటు, హోమ్ క్వారంటైన్ కారణంగా ఒంటరితనాన్ని తట్టుకోలేక భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 14, 2020 at 09:51AM
No comments