దేశంలో నవంబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ టీకా.. దీని ధర ఎంతంటే?
కరోనా వైరస్‌తో సతమతమవుతోన్న ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ ఆశలను నిజం చేస్తూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, వ్యాక్సిన్ తయారీలో భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్.. నవంబరులో ఇక్కడ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అడార్ పూనావాలా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌తోపాటు సమాంతరంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. పరీక్షించని ఔషధం కోసం 200 మిలియన్ డాలర్లు ఖర్చుచేయాలనే నిర్ణయం తీసుకోడానికి 30 నిమిషాలు సయమం పట్టింది.. తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతమైన వ్యాక్సిన్.. మిగతా దశలలో మంచి ఫలితాలను పొందలేకపోతే, మొత్తం వృథా అవుతుందని అన్నారు. ఒక్కో డోస్ ధర రూ.1,000 వరకు ఉంటుందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్ సరఫరా చేయడానికి రెండేళ్లు పడుతుంది. ‘భారత్‌లో వచ్చే నెల మూడో దశ ట్రయల్స్ ప్రారంభిస్తామనే నమ్మకం ఉంది.. ఇది పూర్తి కావడానికి బహుశా రెండు నుంచి రెండున్నర నెలలు పడుతుందని మేము అంచనా వేస్తున్నాం ... నవంబర్ నాటికి ట్రయల్స్ పూర్తయి సానుకూల ఫలితాలు వెలువడి, టీకా సురక్షితమైందని, సమర్థవంతంగా పనిచేస్తుందని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదిస్తే టీకా ఉత్పత్తి ప్రారంభించాలని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇక, సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసే ‘కోవిషీల్డ్’లో సగం విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంటే ప్రతి నెలా సుమారు 60 మిలియన్ డోస్‌లు ఉత్పత్తి చేస్తే.. దేశంలో 30 మిలియన్లు అందుబాటులో ఉంటాయి. మొదట మన దేశాన్ని రక్షించడం కూడా దేశభక్తి విధిగా పరిగణించబడుతుంది, చివరికి అది జాతి ఉత్తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పూనావాలా అన్నారు. ‘మొత్తం ప్రపంచానికి టీకా అందబాటులోకి తేవాలని, మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోకపోతే కర్మాగారాలు, వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోతాయి.. అంటే దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడిన భారతదేశంపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు, ఆర్థికవేత్తలు చాలా స్పష్టంగా పేర్కొన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి దేశం అవగాహన చేసుకుంటుందని అన్నారు. తొలుత వ్యాక్సిన్‌ను కరోనా యోధులు లేదా పరిస్థితి విషమంగా ఉన్నవారికి అందజేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దీనిపై అంటువ్యాధుల నిపుణులే మంచి నిర్ణయం తీసుకోగలరని వ్యాఖ్యానించారు. టీకా ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియదు... ఒక ట్రయల్ ఒక టీకా పనిచేస్తుందో లేదో మాత్రమే చెప్పగలదు కానీ అది ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత మందిని రక్షిస్తుందో తెలియదని పరిస్థితిని వివరించారు.
By July 22, 2020 at 08:25AM
No comments