జులైలోనే 6 లక్షలు కేసులు.. మరణాల్లో స్పెయిన్‌ను దాటేసిన భారత్
దేశంలో మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 12 లక్షలకు చేరుకోగా.. 6 లక్షల కేసులు జులై నెలలోని 20 రోజుల్లో నమోదయ్యాయి. భారత్‌లో వైరస్ వ్యాప్తి మొదలైనప్పటితో పోల్చితే జులై నెల లో మరణాలు కూడా భారీగా చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలు 28,723కి చేరుకోగా.. ఒక్క జులైలోనే ఇప్పటి వరకూ 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దేశంలోని మొత్తం కరోనా మరణాల్లో 40 శాతం జులై 20 రోజుల్లోవే కావడం గమనార్హం. మంగళవారం దేశవ్యాప్తంగా మరో 38,444 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 670 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల్లో స్పెయిన్ (28,422)ను భారత్ అధిగమించింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా నుంచి 7.5 లక్షల మంది కోలుకోగా.. మరో 4.1 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మహారాష్ట్రలో మరో 8వేల కొత్త కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తమిళనాడు 4,965, ఆంధ్రప్రదేశ్ 4,944, ఉత్తరప్రదేశ్ 2,151, ఢిల్లీ 1,349, గుజరాత్ 1,000, మధ్యప్రదేశ్ 785, పంజాబ్ 381 మందికి వైరస్ కొత్తగా నిర్ధారణ అయ్యింది. గుజరాత్‌లో ఒక్క రోజులో నమోదయిన కేసులు తొలిసారి 1,000 దాటాయి. మహారాష్ట్రలో మొత్తం కేసులు 3.27 లక్షలు దాటాయి. ముంబయి నగరంలో నెల తర్వాత వరుసగా ఐదో రోజు 1,000లోపు కేసులు నమోదయ్యాయి. మంగళవారం 992 మందికి వైరస్ నిర్ధారణ కాగా. మొత్తం కేసులు 1,030,368కి చేరింది. కరోనా వైరస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానానికి (58,668) ఎగబాకింది. తొలిస్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక ఉన్నాయి. తమిళనాడులో గత 24 గంటల్లో మొత్తం 50,000 పరీక్షలు నిర్వహించగా 4,965 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.80 లక్షలకు చేరగా.. ప్రస్తుతం 51,344 యాక్టివ్ కేసులున్నాయి. కర్ణాటకలో మంగళవారం 3,469 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 61 మంది మృతిచెందారు. పరీక్షల సంఖ్య పెరుగుతూ కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుండటం కరోనా నియంత్రణకు సూచికలుగా ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.
By July 22, 2020 at 07:29AM
No comments