వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో.. కీసరలో మహిళా అధికారి నిర్వాకం
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ అధికారిణి చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సభ్యులుగా ఉన్న ఓ వాట్సాప్ గ్రూపులో ఆమె పోర్న్ వీడియో పోస్ట్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన కీసర మండలంలో జరిగింది. Also Read: కీసర మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కలిపి ‘హరితహారం’ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. దానిలో రోజూ మండలంలో జరిగిన కార్యక్రమాలు, అధికారుల సమాచారంతో కూడిన పోస్టులు చేస్తుంటారు. సోమవారం రాత్రి మండల స్థాయి అధికారిణి ఒకరు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించేందుకు కొన్ని ఫొటోలతో పాటు ఓ అశ్లీల వీడియోను పోస్టు చేశారు. Also Read: దాన్ని గమనించిన గ్రూప్ సభ్యులు మంగళవారం అధికారిణి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని కొందరు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా అధికారిణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూప్ సభ్యులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే ఆ అధికారిణి కావాలనే ఆ వీడియో పోస్ట్ చేశారా? లేక పొరపాటున జరిగిందా? అన్నది పక్కన పెడితే.. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోకపోతే ఇలాగే పరువు పోవడంతో పాటు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. Also Read:
By July 15, 2020 at 09:11AM
No comments