మరిదితో అఫైర్‌కి అడ్డుగా ఉన్నాడని భర్త దారుణహత్య.. వికారాబాద్‌లో దారుణం
భార్య అక్రమ సంబంధానికి అమాయకుడైన భర్త ప్రాణం బలైపోయింది. ప్రియుడితో రాసలీలలకు అడ్డొస్తున్నాడన్న కక్షతో కట్టుకున్న భార్యే అతడిని కిరాతకంగా చంపేసింది. ఈ ఘటన శివారులోని అనంతగిరి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బైండ్ల చెన్నయ్య(38)కు శశికళ అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ప్రవీణ్, పావని. దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. Also Read: ఈ క్రమంలోనే శశికళ మరిది వరుసయ్యే రమేష్‌తో అనే యువకుడితో ఆరేళ్లుగా కొనసాగిస్తోంది. భర్త చెన్నయ్య మద్యం మత్తులో ఉంటే ఆమె ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొనసాగించేది. ఈ విషయంపై చెన్నయ్య తరుచూ భార్యతో గొడవపడేవాడు. పద్ధతి మార్చుకుని బుద్ధిగా తనతో కాపురం చేయాలని వేధించేవాడు. అయితే ప్రియుడి మోజులో పడిన శశికళ భర్త మాటలను పట్టించుకునేది కాదు. Also Read: తన సుఖానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో భర్తను చంపేయాలని పథకం వేసింది. ఈ నెల 6వ తేదీన శశికళ, చెన్నయ్య, రమేష్ కలిసి కలిసి బస్సులో పరిగికి వచ్చారు. అక్కడే మద్యం కొనుగోలు చేసి అనంతగిరి అటవీ ప్రాంతానికి వెళ్లి తాగారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న చెన్నయ్యపై శశికళ, రమేష్ రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా చెత్త, చెట్ల ఆకులు కప్పి వెళ్లిపోయారు. Also Read: ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అంత్యక్రియలకు కుమారుడు హాజరు కాకపోవడం, భార్య ఏమీ ఎరగనట్టు వ్యవహరించడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి 13వ తేదీన నిలదీశారు. దీనిపై 14న పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. పంచాయతీ పెడితే తన బండారం బయటపడుతుందన్న భయంతో శశికళ 13వ తేదీ రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కాలిన గాయాలతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. Also Read: పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తన భర్తను అనంతగిరి అటవీ ప్రాంతంలో చంపేసి శవాన్ని అక్కడే వదిలేశామని శశికళ చెప్పడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో వికారాబాద్ సీఐ శ్రీనివాసరావు గ్రామస్థుల సాయంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శవం కుళ్లిన స్థితిలో ఉండటంతో డాక్టర్లు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 15, 2020 at 08:49AM
No comments