Breaking News

సరిహద్దుల్లో వివాదంపై సుదీర్ఘ చర్చలు.. అక్కడ నుంచి వెనక్కు వెళ్లాల్సిందేనన్న భారత్


భారత్, చైనా సరిహద్దుల్లో రెండు నెలల ప్రతిష్టంభన తర్వాత సైనికుల ఉప సంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. గాల్వాన్ లోయ, హాంట్‌స్ప్రింగ్‌ల వద్ద ఇరు దేశాలూ సైన్యాలను వెనక్కు తగ్గాయి. ఈ నేపథ్యంలో నాలుగో సారి భారత్, చైనా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిగాయి. సైనికుల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన తర్వాత తొలిసారి జరిగిన సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా దెప్సాంగ్-దౌలత్ బేగ్ ఓల్డీ బేగ్‌లో బలగాల ఉపసంహరణతోపాటు పాంగాంగ్ సరస్సు, హాట్‌స్ప్రింగ్స్‌లో మరింత వెనక్కు వెళ్లాలని చర్చించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చుషుల్-మోల్డ్ సరిహద్దు సమావేశం ప్రాంతంలో భారత్ భూభాగంలో ఈ చర్చలు జరిగాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు అర్ధరాత్రి 2.00 గంటలకు వరకు దాదాపు 15 గంటలు సాగినట్టు తెలుస్తోంది. భారత్ నుంచి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, దక్షిణ జింగ్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రెండు దేశాల మధ్య వివాదం తీవ్రంగా ఉన్న దెప్సాంగ్, పాంగాంగ్ సరస్సు నుంచి రెండో దశ బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఖరారు చాలా క్లిష్టమైన అంశమని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పరిమితి సంఖ్యలో వివాదం ఉన్న గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా వద్ద పరస్పర బలగాలను 1 నుంచి 2.5 కిలోమీటర్ల మేర వెనక్కు తగ్గించి బఫర్ జోన్‌ను ఏర్పాటుచేయాలని జూన్ 30న జరిగిన చర్చల్లో నిర్ణయించారు. తూర్పు లడఖ్‌లోని పలుచోట్ల చొరబడటానికి మే నెలకు ముందున్న యథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్ మరోసారి ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. తూర్పున 1,597 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి తుపాకులు, ట్యాంకులు, ఇతర భారీ ఆయుధాలతో పాటు రెండు వైపులా సుమారు 30,000 మంది సైనికుల వెనక్కు మళ్లింపు కోసం నిర్ణీత సమయంతో కూడిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని భారత్ కోరింది... ఇరు సైన్యాలు అదనపు దళాలను తిరిగి వారి శాశ్వత స్థానాలకు తరలించాలని పట్టుబట్టినట్టు తెలిపాయి. ఎల్ఏసీ ఉత్తరం నుంచి దక్షిణానికి పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 8 నుచంి పీఎల్‌ఏ దళాలు తమ పోస్టులకు 8 కిలోమీటర్ల మేర తూర్పు వైపునకు వెనక్కి వెళ్లాలని కోరినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు ‘ఫింగర్ -4’ ‘బేస్’ నుంచి తూర్పువైపు ‘ఫింగర్ -5’ వైపుకు వెనక్కి తగ్గారు, కాని ఈ ప్రాంతంలో ఆధిపత్యం వహించే రిడ్జ్‌లైన్‌ను ఇంకా పూర్తిగా ఖాళీ చేయలేదని పేర్కొన్నాయి.


By July 15, 2020 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lac-pull-back-india-pushes-for-pla-pullback-at-pangong-depsang-in-tough-talks/articleshow/76971558.cms

No comments