Breaking News

Hyper Aadi: హైపర్ ఆది టీం సభ్యుడికి కరోనా పాజిటివ్ నిజమేనా?


బిగ్ బాస్ ఫేమ్, ఆమెకథ సీరియల్ హీరో రవికృష్ణకు కరోనా సోకిందనే వార్త బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అతనితో పాటు ఈ సీరియల్ హీరోయిన్ నవ్యస్వామికి కరోనా సోకడంతో టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. అంతకు ముందు ప్రభాకర్, హరిక్రిష్ణ‌లతో పాటు మరో ముగ్గురు టీవీ ఇండస్ట్రీకి చెందిన వారికి కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. వీటితో పాటు యాంకర్ ఓంకార్, ఝాన్సీ ఇలా పాపులర్ యాంకర్స్, టీవీ నటులకు కూడా కరోనా అంటూ రూమర్స్ రావడంతో ఈ భయాందోళకు గురౌతున్నారు. అయితే బుల్లితెర సంచలన కామెడీ షో ‘జబర్దస్త్‌’లోనూ కరోనా కలకలం రేపుతోంది. టీం సభ్యుడికి కరోనా సోకిందంటూ వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది టీంలో రైజింగ్ రాజు, దొరబాబు, పరదేశి, శాంతి స్వరూప్ తదితరులు సభ్యులుగా ఉండగా.. వీరితో పాటు ప్రతి వారం స్పెషల్ గెస్ట్‌ను తన స్కిట్ కోసం తీసుకువస్తుంటాడు హైపర్ ఆది. అయితే ఆది టీం సభ్యుడికి కరోనా అంటూ వార్తలు వస్తుండటంతో మిగిలిన సభ్యుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఓంకార్, ఝాన్సీలపై వచ్చినట్టుగానే ఇది రూమరా అంటే వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో హైపర్ ఆది టీం కనిపించకపోవడంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ ఇష్యూని హైపర్ ఆది కాని.. అతని టీం సభ్యులు కాని.. జబర్దస్త్ యాజమన్యం కాని ఇంకా దృవీకరించలేదు. ప్రస్తుతానికి రూమర్ గానే ఉంది. ఇదిలా ఉంటే.. సుమారు మూడు నెలల లాంగ్ గ్యాప్ తరువాత జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తిరిగి ప్రారంభమై టాప్ రేటింగ్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండు వారాలకు సంబంధించిన ఎపోసోడ్ ప్రసారం కాగా.. టాప్ టీఆర్పీ రేటింగ్‌తో పాటు యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నాయి.


By July 07, 2020 at 11:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jabardasth-hyper-aadi-team-members-reportedly-tests-positive-for-coronavirus/articleshow/76828227.cms

No comments