మద్యం మత్తులో కన్నతల్లి గొంతు కోసి హత్య.. గుంటూరు జిల్లాలో దారుణం
జిల్లా మాచర్లలో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ యువకుడు కన్నతల్లినే గొంతు కోసి చంపేశాడు. ఐదో వార్డు సుద్దగుంతల ఒకటో లైన్ వద్ద గండ్రకోట లీలావతి(76) అనే వృద్ధురాలు నివాసముంటోంది. ఆమె కొడుకు రామకృష్ణ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒంటరిగా ఉంటున్న లీలావతికి సేవలు చేసేందుకు ఓ పనిమనిషిని పెట్టాడు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో పనిమనిషి కొద్దిరోజులుగా రావడం లేదు. Also Read: దీంతో సేవలు చేసేవారు లేక లీలావతి ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఆమె కొడుకు రామకృష్ణకు చెప్పడంతో కొద్దిరోజుల క్రితం అతడు మాచర్లకు చేరుకుని తల్లికి సపర్యలు చేస్తున్నాడు. అయితే వృద్ధురాలైన తల్లికి సేవలు చేయడం ఇష్టంలేని రామకృష్ణ ఆమెను దుర్భాషలాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి పడుకున్నాడు. Also Read: సోమవారం తెల్లవారుజామున మత్తులో తల్లి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో మాచర్ల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ ఇంటి నుంచి కరోనా కేసులు భారీగా ఉండటంతో పోలీసులు ఇంటి లోనికి వెళ్లేందుకు జంకుతున్నారు. Also Read:
By July 20, 2020 at 11:52AM
No comments