చిరుతో ఛాన్స్ మిస్.. సుజిత్ మల్టీస్టారర్ మూవీ!
మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ మూవీకి డైరెక్టర్‌గా సుజిత్‌ను ఎంచుకున్నారు. అయితే స్టోరీ మార్పులు చేర్పుల విషయంలో ఎక్కడో తేడా కొట్టిందని సుజిత్‌ను చిరు పక్కనెట్టారని.. మరోవైపు మెగాస్టార్‌కు స్టోరీ వినిపించగా ఆయన నచ్చనలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కొత్త దర్శకుడు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో అటు మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్న కొన్ని గంటలకే సుజిత్‌కు బంపరాఫర్ వచ్చిందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మరో స్క్రిప్ట్‌పై ఆయన దృష్టి పెట్టాడట. వాస్తవానికి గతంలో తన వద్ద ఉన్న కథకే ఇప్పుడు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యాడట.
అయితే ఈ కథను యూవీ క్రియేషన్ వారు నిర్మించేందుకు ముందుకొచ్చారట. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలియవచ్చింది. ఈ మూవీ ఓ మీడియం రేంజ్ బడ్జెట్‌తోనే ముగిసిపోతుందట. ఇప్పటికే ఓ ఇద్దరు కుర్ర హీరోలకు స్టోరీ లైన్ చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి తగ్గితే అధికారిక ప్రకటన చేసే అవకాశముందట. ఈ లోపు మార్పులు,చేర్పులు పూర్తి చేసుకోవడానికి సుజిత్ సన్నాహాలు చేస్తున్నాడట.
మొత్తానికి చూస్తే.. మెగాస్టార్‌తో సినిమా పోతేనేం మల్టీస్టారర్ మూవీ చాన్స్ వచ్చిందన్న మాట. వాస్తవానికి ‘సాహో’ లాంటి చిత్రాన్ని స్టార్ హీరో అయిన ప్రభాస్‌తో డీల్ చేసిన సుజిత్‌కు మల్టీస్టారర్ పెద్ద కథేం కాకపోవచ్చేమో. సెప్టెంబర్‌లో అధికారిక ప్రకటన చేసిన అనంతరం షూటింగ్ షురూ చేస్తారట. అయితే సినిమా మాత్రం వచ్చే ఏడాది అనగా సంక్రాంతి తర్వాత థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఆ ఇద్దరు కుర్ర హీరోలు ఎవరనే విషయం మాత్రం తెలియట్లేదు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
By July 29, 2020 at 03:31PM
No comments