Breaking News

నల్గొండ: హెడ్ కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులు.. చెప్పుతో కొట్టిన వివాహిత


సాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కీచక కానిస్టేబుల్. తన కోరిక తీరిస్తేనే న్యాయం జరిగేలా చేస్తానంటూ వెంటపడ్డాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి అతడికి తగిన బుద్ధి చెప్పింది. పట్టణానికి చెందిన దంపతులు మనస్పర్థలతో తరుచూ గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలో భర్తపై ఫిర్యాదు చేసేందుకు భార్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. Also Read: ఆమెపై కన్నేసిన హెడ్‌కానిస్టేబుల్ ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. తన కోరిక తీరిస్తే న్యాయం జరిగేలా చేస్తానంటూ వేధించాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు తన కుటుంబంతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆయన సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఆమెను వేధించినందుకు నష్టపరిహారం కూడా చెల్లించేలా ఆ నేత వద్ద రాజీ కుదిరింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. Also Read:


By July 26, 2020 at 11:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-conistable-sexuallly-harassed-on-married-woman-in-nalgonda-district/articleshow/77178896.cms

No comments