Breaking News

ఇక చెవులూ మూయాల్సిందే.. వాటి ద్వారా కరోనా: తాజా అధ్యయంలో వెల్లడి


కోవిడ్-19 మొదలైన తొలినాళ్లలో ముక్కు, నోటి ద్వారా వ్యాప్తి చెందుతుందని నిపుణులు గుర్తించడంతో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తర్వాత మరో పరిశోధనలో కళ్ల ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుందని తేలడంతో కళ్లజోళ్లు, ఫేస్ కవర్‌లు వాడుతున్నారు. తాజాగా, మహమ్మారి చెవుల ద్వారా కూడా సోకుతుందని పరిశోధకులు గుర్తించారు. అదే రుజువైతే ఇక నుంచి చెవ్వులు మూసివేయాల్సిందే. కోవిడ్ బాధితులు చెవుల్లో కూడా ఉందని స్పష్టమైంది. చెవి మధ్యలోని (Mastoid)ఏరియాలో వైరస్ ఉనికి కనిపించింది. ఇది చెవికి వెనుకవైపున ఉండే మెత్తని ఎముక భాగం. చెవి మధ్యలో ఉండే మూడు చిన్న ఎముకలు మనకు ధ్వని వినిపించేలా చేస్తాయి. ఆ ప్రాంతంలోనే కరోనా వైరస్ ఉందని తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన వివరాల్ని JAMA ఓటోలారిన్గోలోజీ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భాగంగా కరోనాతో చనిపోయిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను పరిశీలించారు. వీరిలో ఒకరు 80 ఏళ్ల వృద్ధురాలు, మిగతా ఇద్దరు 60ఏళ్ల వయసున్న ఓ మహిళ, ఓ పురుషుడు. ఈ ముగ్గురూ పోస్ట్‌మార్టమ్ నిర్వహించడానికి 48, 16, 44 గంటల ముందు చనిపోయారు. పోస్ట్‌మార్టంలో వీరికి చెవుల్లోని మస్టాయిడ్‌లను తొలగించి పరిశోధించగా.. అందులో వైరస్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో పరిశోధకులకు ఓ కొత్త సవాల్ ఎదురైంది. గాలి ద్వారా ఈ వైరస్ చెవుల్లోకి ప్రవేశించిందా లేదా ముక్కు, నోరు లేదా కళ్ల ద్వారా లోపలికి వెళ్లిన వైరస్ లోపలి నుంచి చెవుల్లోకి చేరిందా అనేది నిర్ధారించాల్సి ఉంది. అయితే దీనిపై అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పరిశోధకులు తెలిపారు. అయితే ఆసుపత్రులను సందర్శించే రోగులలో లేదా శస్త్రచికిత్సా విధానాలలో వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని బృందం హెచ్చరించింది. మధ్య చెవిలో భాగం వైరస్ వ్యాప్తికి దగ్గరగా ఉండటం వల్ల రక్షణ చర్యలు తీసుకోవాలని, కోవిడ్ -19 లక్షణాల రేటు అధికంగా ఉండటం వల్ల చెవి శస్త్రచికిత్సలకు సంబంధించిన జాగ్రతలు అవసరమని తెలిపారు.


By July 26, 2020 at 11:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/a-recent-study-reveals-covid-19-can-infect-ears/articleshow/77178757.cms

No comments