Breaking News

తెలంగాణ: స్నానం చేస్తుండగా వీడియో తీసి వివాహితపై లైంగిక దాడి


తెలంగాణలోని జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా చాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వేమనపల్లి మండలంలోని సూరారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రసపెల్లి మధు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో వీడియో తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. Also Read: తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో పరువు పోతుందన్న భయంతో బాధితురాలు అతడికి లొంగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కామాంధుడు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ అతడి వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతడు భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By July 22, 2020 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-man-rapes-married-woman-by-blackmailing-her-with-bath-videos/articleshow/77100394.cms

No comments