Breaking News

సరిహద్దుల్లో బలగాల మళ్లింపు తొలి దశ పూర్తయినా, రెండో దశ మాత్రం కాస్త కష్టమే!


పాంగాంగ్ సరస్సు, దెప్సాంగ్ సహా తూర్పు లడఖ్‌లోని ఇతర ప్రాంతాలలో సైన్యాల ఉపసంహరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దశలవారీ ప్రక్రియ కోసం విధివిధానాలు, గడువుపై భారత్, చైనా‌లు ఇంకా పూర్తిగా అంగీకరానికి రాలేదు. దీంతో ఇరు దేశాల వివాదాస్పద ప్రాంతాల్లో తమ సైన్యాలను, ఆయుధాలను భారీగా మోహరించడానికి కూడా దారితీసే అవకాశం ఉంది. మంగళవారం ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల్లో 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొన్నారు. దాదాపు 15 గంటలపాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో సైన్యాల ఉపసంహరణ ప్రక్రియపై వివరణాత్మక ప్రతిపాదనలు, విధానాలు గురించి చర్చించారు. జూన్ 15 గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఇరు దేశాలూ చర్చల ద్వారా వివాదం పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. రెండో దశ బలగాల ప్రక్రియ తరలింపులో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు చుషుల్‌లో ప్రారంభమైన సమావేశం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ముగిసింది. తొలి విడత బలగాల ఉపసంహరణ విజయవంతం కావడంతో రెండో దశ రోడ్ మ్యాప్ ఖరారుచేయడానికి ఇరు పక్షాలు తమ రాజకీయ-సైనిక విధానాలను ప్రతిపాదించాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో జరిగిన నాలుగో దశ చర్చల గురించి ఉన్నతాధికారులతో ఆర్మీ చీఫ్ నరవాణే అంతర్గతంగా చర్చించారని సమాచారం. ఉదయం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ, సాయంత్రం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తోనూ ఆయన కలిశారు.


By July 16, 2020 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lac-pull-back-de-escalation-in-pangong-tso-depsang-still-some-distance-away/articleshow/76991232.cms

No comments