చాబర్ ప్రాజెక్ట్ నుంచి భారత్‌ను తప్పించినట్టు ప్రచారం.. ఇరాన్ కీలక ప్రకటన!
ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో భారత్‌తో కలిసి నిర్మించ తలపెట్టిన భారీ రైల్వే ప్రాజెక్టు నుంచి ఇండియాను తప్పించినట్టు వచ్చిన వార్తలపై ఇరాన్ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఇరాన్ ప్రకటించింది. భారత్‌కు తమకు మిత్రదేశమని, వారితో స్నేహాన్ని వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మారీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు. ‘జహేదాన్-చాబర్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. చాబర్ ప్రాంతంలో భారత్‌తో రెండు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఒకటి పోర్టుల్లో యంత్రాలు, ఇతర పరికరాల సరఫరా నిమిత్తం, రెండోది 150 మిలియన్ డాలర్ల ప్రాజెక్టు’ అని ఫర్హాద్ వ్యాఖ్యానించినట్టు న్యూస్ ఏజన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. చాబహార్ పోర్ట్‌లో పెట్టుబడులపై భారత్ రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది.. వాటిల్లో రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా ఉందని అన్నారు. చైనాతో 400 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకోబోతున్న ఇరాన్.. చాబర్ రైల్వే లేన్ ప్రాజెక్ట్ నుంచి భారత్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుందనే వార్తలు వచ్చాయి. చాబర్ పోర్టు నుంచి అప్ఘానిస్థాన్ సరిహద్దుల వెంబడి జహేదాన్ వరకు నిర్మించనున్న రైలు మార్గం పనుల నుంచి భారత్‌ను తప్పిస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఒప్పందం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు ప్రారంభానికి భారత్ నిధులు ఇవ్వడం లేదని.. దీంతో ఈ రైలు మార్గాన్ని తామే సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ ప్రకటించినట్టు ప్రచారం జరిగింది. వాస్తవానికి, మార్చి 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ సహకారం లేకుండానే ఇరాన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టును చేపడతాయని.. దాదాపు 400 మిలియన్ డాలర్లను ఇరానియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి కేటాయిస్తారని వార్తలు వచ్చాయి
By July 16, 2020 at 09:20AM
No comments