Breaking News

మోసం చేస్తున్నాడు.. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. సింగర్ సునీత ఫైర్


రంగుల ప్రపంచమనగానే జనాలకు అదో క్రేజ్. సినిమాల పట్ల మోజుతో కెమెరా ముందు కనిపించి టాలెంట్ చూపించాలనే ఉబలాటంతో ఎంతోమంది అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి వారి వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. అవకాశాలు ఇప్పిస్తామంటూ.. మాకు వారు తెలుసు, వీరు తెలుసు అని చెబుతూ బురిడీ కొట్టించి సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి మోసాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇదే విషయమై ఇటీవలే కొందరు సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అలాంటి మోసగాళ్ల మాయలకు బ్రేకులు పడటం లేదు. తాజాగా మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతుండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా స్పందించిన సునీత.. తనకు మేనల్లుడు ఎవరూ లేరని, దయచేసి అలాంటి వారిని నమ్మకండి అంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. Also Read: ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. చైతన్య అనే అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి నా మేనల్లుడు అని చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. చాలామంది సెలబ్రిటీలతో కూడా నా పేరు చెప్పి పరిచయాలు పెంచుకుంటున్నాడట. అలాగే అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర డబ్బులు కాజేస్తున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసి నేను షాకయ్యాను. చైతన్య అనే వాడెవడో కూడా నాకు తెలియదు. వాడి మాటలు నమ్మి మోసపోకండి. ఎవ్వరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా. సెలబ్రిటీకి చుట్టం అని చెప్పగానే వారికి డబ్బులిచ్చి ఎలా మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించాలి కదా!. ఇకనైనా బయటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే జాగ్రత్తగా ఉండండి. దయచేసి డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవడో నాకు తెలియదు. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. వాడిని వదలను’’ అని పేర్కొంటూ ఫైర్ అయింది సునీత.


By July 28, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-sunitha-fires-on-fake-person-which-he-used-her-name-for-frauds/articleshow/77211531.cms

No comments