Breaking News

Bandla Ganesh: మరణం లేని మహానేత వైఎస్ఆర్.. సీఎం జగన్ పోస్ట్‌పై బండ్ల గణేష్ రియాక్షన్


నేడు (జులై 8) దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర పుష్క గుచ్చం ఉంచి స్మరించుకున్నారు. మరోవైపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సీఎం జగన్.. ''నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అని పేర్కొన్నారు. Also Read: సీఎం జగన్ పెట్టిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు. వైఎస్ఆర్‌ను స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. కాగా ఈ ట్వీట్ చూసిన నిర్మాత, నటుడు వెంటనే రియాక్ట్ అవుతూ '100 శాతం కరెక్ట్ జగన్ సార్' అని కామెంట్ చేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌ అయ్యారు. కొన్ని రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్‌పై సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఇకపోతే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, మంచిని మాత్రమే మెచ్చుకుంటా అని ఇటీవలే బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


By July 08, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bandla-ganesh-reaction-on-y-s-jaganmohan-reddy-tribut-for-ysr/articleshow/76846619.cms

No comments