గాఢనిద్రలో ఉన్న భర్తను చంపేసి.. ప్రియుడి ఇంటికెళ్లి రాసలీలలు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిన కిరాతకురాలిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లిలో కొత్తచెరువు వెంకటేసు, అరుణ దంపతులు నివాసముంటున్నారు. అరుణ అదే గ్రామానికి చెందిన కేశవ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేసు పద్ధతి మార్చుకోవాలని అనేకసార్లు భార్యను మందలించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. Also Read: ఈ నెల 26న అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాఢనిద్రలో ఉన్న భర్తను అరుణ కొడవలితో దాడిచేసి చంపేసింది. ఇంట్లో పడిన రక్తపు మరకలను జాగ్రత్తగా తుడిచేసి అక్కడి నుంచి ప్రియుడి వద్దకు వెళ్లి రాసలీలలు సాగించింది. శుక్రవారం మధ్యాహ్నం ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వచ్చి భర్త మృతదేహాన్ని చూసి రోదించింది. తనను డ్వాక్రా పనిమీద పెడపల్లి బ్యాంకు వద్ద భర్తే బైక్‌పై దించి వెళ్లాడని, ఇంతలోనే ఆయన్ని ఎవరో హత్య చేశారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. Also Read: అయితే మృతుడి అన్న తిప్పన అరుణ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అరుణను అదుపులోకి తీసుకుని విచారించగా తానే భర్తను చంపినట్లు నేరం అంగీకరించింది. దీంతో అరుణపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెకు సహకరించిన కేశవను సహ నిందితుడిగా చేర్చారు. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసిన అరుణను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. Also Read:
By July 01, 2020 at 09:02AM
No comments