ఏలూరులో దారుణం.. నవవధువు అనుమానాస్పద మృతి
పెళ్లై కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఓ అమ్మాయి చనిపోయింది. పెళ్లైన కొన్నాళ్లకే ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ దుర్ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో గంధం సుద అనే 18 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. సుధకు మేనెలలోనే జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన బాలు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేశారు. ఇంతలో ఏమైందో.. ఏమోగానీ సుధ అర్థాంతరంగా మరణించింది. పెళ్లైన రెండు నెలలకే సుధ ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుధ భర్తతో పాటు తన అత్తింటి వారిని కూడా విచారిస్తున్నారు.
By July 01, 2020 at 08:35AM
No comments