ప్రియుడి కోసం వెళ్లిపోయిన కూతురు.. మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య
జిల్లా తహసీల్దార్ శ్రీనివాసులు(57) ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు సమీపంలో ఆయన సోమవారం (జూన్ 29) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆయన బలవన్మరణానికి గల కారణాన్ని భార్య పద్మావతమ్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. శ్రీనివాసులు, పద్మావతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు మంజులకు కొంతకాలం క్రితమే వివాహం కాగా.. చిన్న కుమార్తె బీటెక్ పూర్తిచేసి హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది. Also Read: ఇటీవల ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. తాను ప్రియుడిని తప్ప వేరెవరినీ పెళ్లిచేసుకోనని చెప్పింది. అయితే ఆమె ప్రేమను శ్రీనివాసులు అంగీకరించలేదు. ప్రేమ వివాహం చేసుకుంటే పరువు పోతుందని, బంధువర్గంలో తలెత్తుకుని తిరగలేమని ఆయన చెప్పి బంధువుల అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. లాక్‌డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యువతి సోమవారం ల్యాప్‌టాప్ రిపేర్ చేయించుకొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. Also Read: తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని, తాను హైదరాబాద్ వెళ్తున్నానని తన అక్క మంజుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. ఈ విషయాన్ని మంజుల తన తండ్రికి చెప్పగా ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అదే రోజు సాయంత్రం బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన శ్రీనివాసులు సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. కుటుంబసభ్యులు, బంధువులు కలిసి శ్రీనివాసులు కోసం వెతుకుతుండగా దిన్నెదేవరపాడు వద్ద చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. ఈ ఘటనపై కర్నూలు తాలుకా అర్బన్ ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 01, 2020 at 09:19AM
No comments