చిచ్చురేపిన కులం.. పురుగులమందు తాగిన ప్రేమజంట, యువకుడి మృతి
జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన ప్రేమికుడు ప్రాణాలు కోల్పోగా.. ప్రియురాలు మృత్యువుతో పోరాడుతోంది. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు ధర్మవరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నారు. రోజూ కాలేజీకి వెళ్లొచ్చే క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. Also Read: అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. ఆమెకు పెళ్లి సంబధాలు చూడటం మొదలుపెట్టారు. తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతున్నారని మనస్తాపం చెందిన ప్రేమజంట బుధవారం ఉదయం గ్రామ శివారులోని ఓ తోటలోకి వెళ్లి పురుగుల మందు తాగేశారు. Also Read: వీరిని గమనించిన గ్రామస్థులు వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువతి పరిస్థితి విషమంగాఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బత్తలపల్లి పోలీసులు యువకుడి మృతదేహానికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:
By July 23, 2020 at 09:52AM
No comments