అమావాస్య ఎఫెక్ట్: చేతబడి కోసం పూడ్చిన శవాన్ని ఎత్తుకెళ్లారు
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్నా మనదేశంలోని మారుమూల గ్రామాల్లో మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటి కోసం కొందరు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. భీమన రోజు చేతబడికి శవాన్ని వినియోగిస్తే అనుకున్నది సాధ్యమవుతుందన్న ఆశతో కొందరు శ్మశానంలో పూడ్చిన శవాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లాలో జరిగింది. Also Read: బాగల్‌కోటె జిల్లాలోని ముధోళ తాలూకా ‘రోగి’ గ్రామానికి చెందిన రామణ్ణ అనే వ్యక్తి క్యాన్సర్‌తో ఫిబ్రవరిలో చనిపోయాడు. అతడి శవాన్ని కుటుంబసభ్యులు శ్మశానంలో పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. అమావాస్య రోజు రాత్రి కొందరు దుండగులు అతడి శవాన్ని(ఎముకలు మాత్రమే ఉన్నాయి) వెలికితీసి ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో శ్మశానానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భీమన అమావాస్య రోజున శవంతో చేతబడి చేస్తే కొన్ని శక్తులు సిద్ధిస్తాయన్న నమ్మకముందని, అందువల్లే క్షుద్ర మాంత్రికులెవరైనా శవాన్ని ఎత్తుకుని వెళ్లుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. Also Read:
By July 23, 2020 at 10:13AM
No comments