Breaking News

ఆస్తి కోసం తాతను చంపేసిన మనవడు.. విజయవాడలో దారుణం


ఆస్తి కోసం తాత ప్రాణాలు తీశాడో మనవడు. ఈ ఘటన విజయవాడలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బీసెంట్‌ రోడ్డుకు చెందిన పులి అప్పారావు(93) బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తులన్నీ పిల్లలకు రాసిచ్చేసి బీసెంట్‌రోడ్డులో ఓ ఇంటిని తన పేరుమీద ఉంచుకున్నారు. కొన్నాళ్లు భార్యతో కలిసి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉన్నారు. భార్య చనిపోయాక విజయవాడకు వచ్చేసి ఓ వృద్ధాశ్రమంలో చేరారు. అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చి కొద్దిరోజులు ఉండేవారు. Also Read: ఈ ఇంటి పక్కనే మనవడు(కొడుకు కుమారుడు) దుర్గాప్రసాద్(24) ఉంటున్నాడు. తాత ఆస్తిపై కన్నేసిన అతడు దాన్ని తనకు రాసివ్వాలంటూ కొంతకాలంగా గొడవపడుతున్నాడు. రామవరప్పాడులో ఉన్న అపార్ట్‌మెంటును తనకు రాసివ్వాలని మంగళవారం అర్ధరాత్రి దుర్గాప్రసాద్‌ తాతతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఉదయం 6 గంటల సమయంలో భవనం రెండో అంతస్తులో అద్దెకు ఉండే కిరణ్‌కుమార్‌ కిందికి దిగుతుండగా... గదిలో విగతజీవిగా పడివున్న అప్పారావును చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. Also Read: దీంతో గవర్నర్‌పేట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. అప్పారావు ముఖంపై బలమైన గాయాలుండటంతో ఆయన్ని హత్య చేసినట్లు నిర్ధారించారు. మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్‌ తాత వద్దకు వచ్చి గొడవ పడినట్లు తేలడంతో అతడు హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దుర్గాప్రసాద్‌ గట్టిగా తోయడంతో అప్పారావు పక్కనే ఉన్న సింక్‌పై పడిపోయి ఉంటారని, ఆ దెబ్బకే చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By July 23, 2020 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-kills-grand-father-over-property-disputes-in-vijayawada/articleshow/77119847.cms

No comments