Breaking News

బాబాయ్‌తో ప్రేమాయణం.. పెద్దలు మందలించడంతో ప్రియుడితో కలిసి


చాలామంది ప్రేమకు ఆస్తులు, కులాలు అడ్డొస్తే వీరి ప్రేమకు మాత్రం వరుసలు అడ్డొచ్చాయి. ప్రియుడికి యువతి కూతురు వరుస అవుతుందని తెలియడంతో కుటుంబసభ్యులు అడ్డు చెప్పారు. దీంతో కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చావాలనుకున్న ఆ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో పడిపోగా.. మృతి చెందిందని భావించిన యువకుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కడ్తాల్‌ మండల పరిధిలోని సాలార్‌పూర్‌ గ్రామంలో బుధవారం జరిగింది. Also Read: సాలార్‌పూర్‌ గ్రామానికి చెందిన నేనావత్‌ పూల్యా, కోటి దంపతుల కుమారుడు నేనావత్‌ రమేశ్‌(24) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వరసకు కూతురయ్యే యువతితో మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వరస కుదరక పోవడంతో ఆ యువతికి కుటుంబసభ్యులు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం రాత్రి ప్రియుడితో కలిసి గ్రామ సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. ఇద్దరూ పురుగులమందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. Also Read: బుధవారం తెల్లవారుజామున రమేశ్‌కు మెలకువ రాగా.. లేచి యువతిని చూడగా ఆమె కదలకుండా పడి ఉంది. దీంతో చనిపోయిందని భావించి తాను చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉదయం పశువుల పాలు పితికేందుకు వెళ్లిన రమేశ్‌ తండ్రి కొడుకు చెట్టుకు వేలాడుతుండటాన్ని చూసి షాకయ్యాడు. పక్కనే యువతి కూడా ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కొనఊపిరితో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 30, 2020 at 08:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-couple-try-to-suicide-in-ranga-reddy-district-man-died-woman-rush-in-hospital/articleshow/77253131.cms

No comments