Breaking News

సరిహద్దుల్లో స్వల్పంగా తగ్గిన వేడి.. అయినా ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే


వాస్తవాధీన రేఖ వద్ద నాలుగు చోట్ల బలగాలను స్వల్పంగా తగ్గించినా కానీ, భారత్, చైనాలు పూర్తిస్థాయిలో తమ సైన్యాలను వెనక్కు తగ్గించే ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. ఈ వారం ప్రారంభంలో భారత, చైనా మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చ కొనసాగుతుందని, సైన్యాల ఉప-సంహరణ మరింత వివరంగా నిర్వచించాలని భావిస్తున్నాయి. జూన్ 15న గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణ ప్రాంతం నుంచి చైనా వైదొలగాలని భారత్ బృందం కోరింది. చర్చలు సానుకూలంగా సాగినప్పటికీ, ఉద్రిక్తత తగ్గింపు సుదీర్ఘ ప్రక్రియ అవుతుందని భావిస్తున్నారు. పూర్తిగాల బలగాల తొలగింపు ప్రక్రియ వచ్చే శీతాకాలం వరకు కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా.. ఉద్రిక్తతను తగ్గించడానికి చైనాపై భారత్ ఒత్తిడి తీసుకొస్తుంది. తమ భూభాగం విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని, వాస్తవాధీన రేఖ నుంచి సీపీఎల్ఏ తన సైన్యాలను వెనక్కి తీసుకోవాల్సన అవసరం ఉందని కేంద్రం పునరుద్ఘాటించింది. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద ఉన్న ‘ఫింగర్ 4-8’ ప్రాంతంలో చైనా బలగాలు ప్రవేశించగా, పెట్రోలింగ్ మార్గాలు ఇటీవలి కాలంలో మరింత వివాదాస్పదంగా మారాయి. అంతకు ముందు, భారత్ వైపున మౌలిక సదుపాయాలు లేకపోవడం చైనా దళాలకు గణనీయమైన మార్గాన్ని చూపింది. ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి వ్యూహాత్మక ప్రాంతం దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్పాంగ్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ) భారీగా సైన్యాలు, ఆయుధాలను మోహరించినా పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత్ కూడా వేలాది మంది అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులు, వాహనాలును తరలించింది. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు సరిహద్దుల్లో ఎగురుతున్నాయి.. ఈ ప్రాంతంలో తాము కూడా పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి.


By July 03, 2020 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-china-border-standoff-a-minor-cool-off-but-lacs-still-hot/articleshow/76762022.cms

No comments