Breaking News

భార్యకు కరోనా వస్తే.. పనిమినిషి పేరుతో శాంపిల్స్ పంపిన డాక్టర్


ఓ ప్రభుత్వ వైద్యుడి భార్యకు కరోనా వచ్చింది. అయితే అతడు ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో టెస్టుల కోసం భార్య నమూనాల్ని ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరుతో పంపాడు. దీంతో అసలు విషయం ఆ తర్వాత బయటపడటంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సింగ్రౌలికి చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడు.. సెలవు తీసుకోకుండానే తన కుటుంబంతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. జూన్ 23న యూపీకి వెళ్లిన డాక్టర్ కుటుంబం జులై మొదటి వారంలో సింగ్రౌలికి తిరిగి వచ్చారు. Read More: అయితే ఆ తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆమె నమూనాలను పనిమనిషి పేరుతో పంపాడు. ఆ నమూనాలను పరీక్షించడంతో.. కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఈ క్రమంలో పనిమనిషి పేరుతో నమూనాలను పంపిన అడ్రస్ కు వైద్యాధికారులు, పోలీసులు వచ్చారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. కరోనా సోకింది డాక్టర్ భార్యకని తేలింది. డాక్టర్ తో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యుడితో పాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు డాక్టర్‌ను కలిసినవారందర్నీ గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. జులై 1 తర్వాత డాక్టర్ ను కలిసిన 33 మంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. వీరిలో ఒకరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు. త్వరలోనే వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అటు డాక్టర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కరోనా నుంచి వైద్యుడు కోలుకున్న తర్వాత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


By July 12, 2020 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/wife-test-covid-positive-madhya-pradesh-doctor-sends-maids-sample-instead/articleshow/76919135.cms

No comments