పక్క రాష్ట్రాల అమ్మాయిలతో వ్యభిచారం.. హైదరాబాద్‌లో ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్ నగరంలో వ్యభిచార ముఠాల కార్యకలాపాలు మళ్లీ కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కొద్ది రోజులు సెలైంట్‌గా ఉన్న వ్యభిచార నిర్వాహకులు మళ్లీ విటులను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. రెండ్రోజుల క్రితమే నగరంలో ఓ సెక్స్‌రాకెట్‌ను చేధించిన పోలీసులు తాజాగా మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న వ్యభిచార రాకెట్‌ను చేధించారు. ఈ సందర్భంగా ముగ్గురు సెక్స్‌వర్కర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: అయ్యప్ప సొసైటీలోని విజయలక్ష్మి సూపర్ మార్కెట్ మూడో అంతస్తులో గత కొన్ని నెలలుగా సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఓయో రూమ్స్ నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం మూతపడటంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు తప్పుడు వ్యాపారం ప్రారంభించాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను నగరానికి తీసుకొచ్చి తన లాడ్జిలో ఉంచాడు. అక్కడికి వచ్చే కస్టమర్లకు అమ్మాయిలను ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నాడు. Also Read: స్థానికుల సమాచారంతో సురేందర్ రెడ్డి కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు గురువారం వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సురేందర్‌రెడ్డితో పాటు ముగ్గురు సెక్స్‌వర్కర్లు, కిషోర్ అనే విటుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలోనూ మనుషులు మధ్య భౌతిక దూరం పాటించాలని సూచిస్తుంటే.. కొందరు అక్రమార్కులు ఇలా ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By July 10, 2020 at 09:10AM
No comments