నడివీధిలో నాలుగు గంటలుగా కరోనా డెడ్ బాడీ.. స్పందించని అంబులెన్స్
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా కరోనా బాధితులుఎక్కువవుతున్నారు. ఈ క్రమంలో కరోనాతో చనిపోతున్న వారి విషయంలో అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో మరణిస్తే.. కొందరు కుటుంబ సభ్యులు తమ వారి డెడ్ బాడీని కూడా తీసుకెళ్లడానికి ముందుక రావడం లేదు. మరోవైపు ఆస్పత్రి సిబ్బంది సైతం కరోనా మృతదేహాల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకలో ఇటీవలే చోటు చేసుకున్న ఘటనలు చూస్తే... కరోనా వల్ల మానవ సంబంధాల్ని... మానవత్వాన్ని ఎంతలా దిగజారిందోనన్న విషయం తెలిసింది. తాజాగా బెంగుళూరులో నడివీధిలో గంటలతరబడి ఉండిపోయింది. అంబులెన్స్‌కు ఫోన్ చేసిన సిబ్బంది స్పందించలేదు. దీంతో నాలుగు గంటలపాటు.. కరోనా డెడ్ బాడీతోనే కుటుంబం నడిరోడ్డపై నిలిచిపోయింది. వివరాల్లో వెళ్తే.. బాధితుడు గొంతు నొప్పి అనారోగ్యం రావడంతో గురువారం కరోనా టెస్టులు చేయించుకున్నాడు. అయితే శుక్రవారం రిపోర్ట్ వచ్చింది. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు బయల్దేరాడు. ఆస్పత్రి దగ్గర్లోనే ఉంది నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాడు. రోడ్డుపై రాగానే అతడికి గుండెపోటు కూడా రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో అతడి మృతదేహం తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేసిన సిబ్బంది గంటల వరకు స్పందించలేదు. దీంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్లు భయాందోళనలకు గురైన పరిస్థితి నెలకొంది. కనీసం వారికి సాయం చేయాలన్నా.. ఎక్కడ తమకు కరోనా వస్తుందోనన్న భయంతో దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. ఇంటికి 40 అడుగుల దూరంలోనే అతడు చనిపోయాడు. దీంతో అటువైపుగా ఆ సయయంలో వెళ్లి వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు కరోనా మృతదేహాల విషయంలో వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారికి వైద్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.కానీ ఈ అంత్యక్రియల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం… ఎంతో మందిని కలిచి వేస్తోంది. ఇటీవల కరోనా డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాలో జేసీబీల్లో తరలిస్తే... కర్నాటకలో వైద్య సిబ్బంది మృతదేహాన్ని దారుణంగా ఈడ్చుకెళ్లారు. కర్నాటక యాదగిరి జిల్లా లో పిపిఈ సూట్ లు ధరించిన సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతి దారుణంగా ఈడ్చుకువెళ్లి అంత్యక్రియలు జరిపిన విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
By July 04, 2020 at 10:08AM
No comments