Breaking News

బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కరోనా..!


కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. కరోనా కారణంగా మూడునెలల పాటు షూటింగులు మానేసి ఇంట్లోనే కూర్చున్న సినిమా, టీవీ రంగానికి చెందిన వారందరూ ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఈ మధ్యనే షూటింగులని స్టార్ట్ చేసారు. ఇలా స్టార్ట్ చేసారో లేదో ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతూ వస్తున్నారు. మహమ్మారీ బారిన పడిన సీరియల్ నటీనటుల్లో ప్రభాకర్, హరిక్రిష్ణ, నవ్యస్వామి ఉన్నారు.

తాజాగా మరో సీరియల్ నటుడు కరోనా బారిన పడ్డారు. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చి బాగా పాపులర్ అయిన రవిక్రిష్ణ మూడురోజుల క్రితం టెస్ట్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో రవిక్రిష్ణ సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని రవిక్రిష్ణ తన సోషల్ మీడియా పేజి ద్వారా పంచుకున్నాడు.

అయితే కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తనకి ఎలాంటి లక్షణాలు లేవట. ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉందని, తనతో కొన్ని రోజులుగా క్లోజ్ గా ఉంటున్నావారికి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసాడట. వారు కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారని తెలిపాడు. ప్రస్తుతానికి రవిక్రిష్ణ సీరియల్ ఆగిపోయిందని సమాచారం.



By July 04, 2020 at 07:57PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/51702/ravi-krishna.html

No comments