ఆర్టీసీ అద్దె బస్సు ఎత్తుకెళ్లిన లారీడ్రైవర్.. నిందితుడికి కరోనా లక్షణాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ అద్దె బస్సు అపహరణకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం పట్టణానికి చెందిన శీలం మల్లయ్య ఆర్టీసీ డిపోలో ఎక్స్‌ప్రెస్ బస్సును అద్దెకు నడుపుతున్నారు. గురువారం రాత్రి బస్టాండ్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన బస్సు శుక్రవారం ఉదయానికి కనిపించలేదు. దీనిపై బస్సు యజమానికి సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సును బస్సును తల్లాడకు చెందిన సత్యనారాయణ అనే లారీ డ్రైవర్ ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. Also Read: చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో బస్సుతో పాటు నిందితుడిని పట్టుకుని సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇక్కడే పోలీసులకు ఓ చిక్కు వచ్చి పడింది. నిందితుడు సత్యనారాయణ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అతడిని వెంటనే సత్తుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. సాధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటనతో సత్తుపల్లి పోలీసులు కలవరపడుతున్నారు. Also Read:
By July 04, 2020 at 09:30AM
No comments